శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడటంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ప్రతిగా జరపగా ముగ్గురు ఉగ్రవాదులను హతమైనట్టు కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. ఉగ్రవాదులను పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు చెందినవారిగా గుర్తించామన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm