హైదరాబాద్ : చైనీయులు వీసాలు పొందడంలో సాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంను గురువారం సీబీఐ విచారించనుంది. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అందుకు ముందు కార్తీ మాట్లాడుదూ.. తనపై పెట్టిన కేసులన్నీ బోగస్ అని.. తాను ఒక్క చైనా జాతీయుడికి కూడా వీసాలు ఇప్పించలేదని స్పష్టం చేశారు. 263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో గత వారం కార్తీపై కేసు నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm