న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగుతున్నాయి. బుధవారం 2124 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, గురువారం కొత్తగా మరో 2628 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే కొత్తగా 18 మంది కరోనాతో మృతిచెందగా, 2167 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో మొత్తం కేసులు 4,31,44,820కు చేరాయి. అందులో 4,26,04,881 మంది కోలుకున్నారు. మరో 5,24,525 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 15,414 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా బుధవారం 13,13,687 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొన్నది. దాంతో మొత్తం ఇప్పటివరకు 1,92,82,03,555 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 10:21AM