హైదరాబాద్ : తెలంగాణలోని హైదరాబాద్ లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ 5 కేసు వెలుగు చూసింది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ బీఏ 4 వైరస్ ను గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో న్యాయ సలహాదారుగా సేవలు అందించే వ్యక్తికి బీఏ 5 వేరియంట్ పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతనికి స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిలిన ఇద్దరి నమూనాలను పరీక్ష కోసం పంపారు. దేశంలో బీఏ 5 మొదటి కేసు గుజరాత్ లో వెలుగు చూసింది. గత 10 రోజులుగా ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం వచ్చే నమూనాలకు అధికారులు జీనోమ్ టెస్టింగ్ కూడా చేస్తున్నారు. బీఏ 4 వేరియంట్ వ్యాపించడం లేదని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm