ముంబై : మహారాష్ట్రలోని రాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నేత అనిల్ పరాబ్‌కు సంబంధించిన అనేక ప్రదేశాలపై ఈ ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (జుణ) దాడులు చేసింది. ఒక భూ ఒప్పందంలో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈ దాడులు చేసింది. గురువారం తెల్లవారుజామునే ముంబైలోని పరబ్ అధికార నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, పుణెలోని మరికొన్ని చోట్ల, డపోలీలో ఉన్న రిసార్టులో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. ఏడు ప్రదేశాలలో సోదాలు జరుగుతున్నాయి.
మిస్టర్ పరబ్ 2017లో రత్నగిరి జిల్లాలోని దాపోలిలో రూ. 1 కోటికి భూమిని కొనుగోలు చేశారని, అయితే ఆ భూమిని ముంబైకి చెందిన కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్‌కు 2020లో రూ. 1.10 కోట్లకు విక్రయించారని, 2017-2020 మధ్య కాలంలో ఆ స్థలంలో రిసార్ట్‌ను నిర్మించారని తెలిసింది. రిసార్ట్ నిర్మాణం 2017లో ప్రారంభమైందని, ఈ వ్యవహారంలో దాదాపు 6 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 11:35AM