చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్, చెన్నైలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ప్రధానికి నిరసన సెగ తగిలింది. నెటిజన్లు ట్విట్టర్ లో గో బ్యాక్ మోడీ (#GoBackModi) అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు వేస్తున్నారు. దాంతో గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది.
హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె 20వ వార్షికోత్సవ వేడుకలు, 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మధ్యాహ్నం రానున్నారు. అనంతరం సాయంత్రం 5:05 నుంచి రాత్రి 8:10 గంటల వరకు మూడు గంటల పాటు చెన్నైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రైల్వేలు, పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. చెన్నై పోర్టు-మదురవాయల్ మధ్య రూ.5,855 కోట్లతో నిర్మించనున్న 20.6 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 12:40PM