Joining order issued for the Box Office Hunt 😎#RamaRaoOnDuty MASSive Release in theatres on June 17 💥💥#RamaRaoOnDutyOnJune17 @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @Cinemainmygenes @sathyaDP @sahisuresh @RTTeamWorks @SLVCinemasOffl pic.twitter.com/81L8AGVI5I
— 𝐑𝐚𝐦𝐚𝐫𝐚𝐨 𝐎𝐧 𝐃𝐮𝐭𝐲 📷 (@RamaraoOnDuty) March 23, 2022
హైదరాబాద్ : హీరో రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్ .రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రం విడుదల వాయిదా పడింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న విడుదలవుతుందని గతంలో ప్రకటించారు. అయిత విడుదల తేదీ దగ్గరకు వస్తుండడంతో అభిమానులు ఆనందపడ్డారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ప్రకటించింది. మంచి అవుట్‌పుట్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రత్యేక శ్రద్ధతో ఇంకా జరుగుతున్నదని.. కావున రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న రిలీజ్ కావడం లేదు అని పేర్కొంది. త్వరలో ఓ కొత్త తేదీని ప్రకటిస్తాం అని మేకర్స్ తెలిపారు.