న్యూఢిల్లీ : ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహనాదారులకు కేంద్రం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రీమియంపై 7.5 శాతం తగ్గింపు ఇచ్చింది.
1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రయివేటు కార్లకు 2019-20లో రూ. 2,072తో ఉండగా ఇప్పుడు రూ. 2,094 కానుంది. ఇక 1000సీసీ నుంచి 1500సీసీ ప్రయివేటు కార్లకు రూ. 3,221 ఉండగా.. ఇప్పుడు రూ.3,416కు పెరుగుతుంది. అయితే 1,500 సీసీ పైబడిన సొంత కార్ల ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కి తగ్గనుంది.
150 సీసీ నుంచి 350 సీసీ లోపు ద్విచక్రవాహనాలకు రూ.1,366గా, 350 సీసీ వాహనాలకు రూ.2,804 గా నిర్ణయించింది. 30 కిలోవాట్ లోపు గల ప్రయివేటు ఎలక్ట్రిక్ కార్ల ప్రీమియం రూ.1,780..
30 నుంచి 65 కిలోవాట్ మధ్య గల వాహనాల ప్రీమియం ఖరీదు రూ. 2,904గా ఉండనుంది.
12,000 కిలోల సరుకు రవాణా వాహనాలకు గతంలో రూ.35,313 ఉండగా ప్రస్తుతం రూ.33,414కు పెంచింది. 40,000 కిలోల పైబడిన సరుకు రవాణా వాహనాలకు ప్రీమియంను రూ.41,561 నుంచి 44,242 కు పెంచింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 01:12PM