హైదరాబాద్ : ప్రధాని మోడీ కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ పలువురు హైదరాబాద్ లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు మంజూరు చేయలేదు, విభజన చట్టం ప్రకారం ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఎక్కడా అంటూ పలు ప్రశ్నలతో బ్యానర్లు కట్టారు. అలాగే నవోదయ విద్యాలయాలు, పసుపు బోర్డు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా అంటూ బ్యానర్లతో ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm