హైదరాబాద్ : కుటుంబ పార్టీలను తరిమేస్తేనే అభివృద్ధి అని ప్రధాని మోడీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీతో బేగంపేట ఎయిర్‌పోర్టులోనే బీజేపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. అంటూ తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలకు పేరుందని అన్నారు. తెలంగాణకు తాను ఎప్పుడొచ్చినా ప్రజల రుణం పెరిగిపోతుందని అనిపిస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు చూపించే అభిమానం, ఆప్యాయతలకు రుణపడి ఉంటానని చెప్పారు. తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. భారత దేశ ఐక్యత కోసం సర్దార్ పటేల్ ఎంతో కృషి చేశారని.. బీజేపీ చెందిన ఒక్కొక్క కార్యకర్త సర్ధార్ పటేల్ ఆశయాల కోసం పోరాడుతారని తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై దాడుల విషయం నా దృష్టికి వచ్చిందని.. ప్రాణత్యాగం చేసిన వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడు-నేడు కూడా ఉన్నారని చెప్పారు. కుటుంబ పాలన చేసేవారు దేశ ద్రోహులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కుటుంబ పాలనతో అవినీతిమయం అయ్యిందని.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అని అన్నారు. తెలంగాణలో మార్పు మొదలైందనే విషయం ఇక్కడి భూమ్మీద అడుగు పెట్టగానే అర్థమైందని అన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కుటుంబ పార్టీలను తరిమిస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి అని చెప్పారు. తెలంగాణను టెక్నాలజీ హబ్‌గా చేశామని చెప్పుకొచ్చారు. యువతతో కలిసి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 01:55PM