హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం ఐఎస్‌బీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm