హైదరాబాద్ : బెంగాలీ మోడల్ నుండి నటిగా మారిన బిదిషా డి మజుందార్(21) కోల్‌కతాలోని డమ్ డమ్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఆమె గత నాలుగు నెలల నుంచి అక్కడే అద్దెకు ఉంటున్నది. బుధవారం సాయంత్రం నాగర్‌బజార్ ప్రాంతంలోని ఆమె ఫ్లాట్ నుండి పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తలుపులు పగులగొట్టి ఆమె ఇంట్లోకి ప్రవేశించగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. ఈ కేసులో ఇప్పటికే బరాక్‌పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, బిదిషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్‌జి కర్ ఆస్పత్రికి తరలించారు. బిదిషా ఫ్లాట్ నుండి పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బిదిసా డికు అనుభాబ్ బేరా అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆమె స్నేహితులు పేర్కొన్నారు. మోడలింగ్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బిదిషా డి మజుందార్, 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వం వహించిన భార్- ది క్లౌన్ అనే షార్ట్ ఫిల్మ్‌లో తన నటనను ప్రారంభించింది. ప్రముఖ నటుడు దేబ్రాజ్ ముఖర్జీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 03:28PM