హైదరాబాద్ : పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కావద్దని.. రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐఎస్‌బీ హైదరాబాద్ మరో మైలురాయి చేరుకుందని తెలిపారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని.. ఇక్కడి విద్యార్థులు దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఐఎస్బీ విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని.. అనేక స్టార్టప్‌లు కూడా రూపొందించారని తెలిపారు. వచ్చే 25 ఏండ్లకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఇంటర్నెట్ వాడకంలో భారత్ రెండో స్థానంలో ఉందని.. స్టార్టప్‌ల రూపకల్పనలో భారత్ మూడో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. వినియోగదారుల మార్కెట్‌లో భారత్ మూడో స్థానంలో ఉందని చెప్పారు.
కరోనా విపత్తు వేళ భారత్ సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. కరోనా కారణంగా గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని తెలపారు. ఈ ఘనతలన్నీ ప్రభుత్వం ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కాలేని.. భారత్ సాధించిన ఘనతలో ఐఎస్‌బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఉందన్నారు. యువత దేశాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని చెప్పారు. మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడించాలని... మీ కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించాలని పేర్నొన్నారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 04:01PM