హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్ అల్లర్లకు సుబ్బారావు ప్రధాన కుట్రదారుగా పోలీసులు నిర్ధారించారు. అతనిని అరెస్టు చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు. సుబ్బారావుతోపాటు అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm