🎶 Shoes off, if you love Bairstow! 🎶#ENGvNZ pic.twitter.com/AAQ2vKUjNS
— Jonny Bairstow’s Barmy Army (@TheBarmyArmy) June 24, 2022
లండన్ : సెంచరీ కొట్టిన క్రికెటర్ కు స్టేడియంలోని అభిమానులు చెప్పులు, షూ చూపించారు. అయితే ఇది కూడా ఒక సెలబ్రేషన్ అని తెలిసింది. ఈ ఘటన ఇంగ్లాండ్ లోని లీడ్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య లీడ్స్ లోని హెడ్డింగ్లీ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో (157 బ్యాటింగ్) సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. జట్టు 55 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా బెయిర్ స్టో.. ఓవర్టన్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు.
ఇదిలా ఉండగా బెయిర్ స్టో సెంచరీ చేసిన తర్వాత బర్మీ ఆర్మీ అనే ఇంగ్లాండ్ అభిమానులు.. తాము వేసుకున్న షూస్, చెప్పులు తీసి వాటిని చేత పట్టి అతడికి అభివాదం చేశారు. 'మీరు బెయిర్ స్టో అభిమానులైతే షూస్ తీయండి..` స్టేడియం మార్మోగిపోయింది. దాంతో చాలా మంది షూస్, చెప్పులు తీసి బెయిర్ స్టో.. బెయిర్ స్టో అని అరిచారు.
మరోవైపు ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఇంకా న్యూజిలాండ్ చేసిన స్కోరుకు 27 పరుగులు తక్కువగా ఉంది. ప్రస్తుతం బెయిర్ స్టో క్రీజులో ఉండడంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం వచ్చే అవకాశం ఇంగ్లాండ్ కు ఉంది.