బెంగళూర్ : కర్ణాటక రాష్ర్టంలోని దక్షిణ కన్నడ (డీకే) జిల్లాలోని సుల్లియా తాలూకాలోని పలు ప్రాంతాల్లో శనివారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ మేరకు అధికారిక వర్గాలు పేర్కన్నారు. సుళ్యా ప్రాంతంలో
ఉదయం 9.10 గంటల సమయంలో తేలికపాటి ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దాదాపు 45 సెకన్ల పాటు భూమి కంపించినప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని వారు తెలిపారు. కల్లుగుండి, సంపాజే, గూనడ్క, అరాంతోడు, ఐవర్నాడు, తొడిక్కన, పేరాజే ప్రాంతాల్లో ప్రకంపణలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 2.4 తీవ్రత నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.
ప్రకంపనలు వచ్చిన వెంటనే నివాసితులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రకంపనల ధాటికి ఇండ్ల లోని ఫర్నిచర్, అల్మారాల్లో ఉంచిన వస్తువులు నేలపై పడ్డాయి. భూమి కొన్ని సెకన్ల పాటు కంపించిందని, ప్రకంపనలు వచ్చినట్లు తమకు తెలియజేయడానికి మ చాలా మంది ఫోన్ చేశారని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కెవి రాజేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jun,2022 04:56PM