తిరుమల : తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవల కోసం లక్కీ డిప్ తేదీలను టీటీడీ తాజాగా ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు జూన్ 27న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అలాగే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జూన్ 27నే సాయంత్రం 4 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలకు గానూ ఈ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తుంది.
వీటితో పాటు జూలై నెలకుగానూ టీటీడీ స్థానిక ఆలయాల్లో సేవల టికెట్లు జూన్ 27న విడుదల చేస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jun,2022 05:18PM