ముంబై : మహారాష్ట్రలో శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. పెండ్లీలు, అంత్యక్రియలు మినహా వీధుల్లో ఎక్కడైనా ఐదుగురు కంటే ఎక్కువ మంది సమావేశాన్ని అనుమతించబోమని పోలీసులు తెలిపారు.
మంత్రులు, ప్రజా ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
కొందరు తిరుగుబాటు పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాలపై శివసేన కార్యకర్తలు దాడి చేసిన కొన్ని హింసాత్మక సంఘటనల జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jun,2022 05:39PM