విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయ పరిసరాలను పొగాకు నిషేధిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం తెలిపారు. దాంతో ఆలయ మెట్ల మార్గం నుంచి కొండ పై భాగం వరకు పొగాకు ఉత్పత్తుల వినియోగంతో పాటు విక్రయాలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించే వారిపై కనిష్ఠంగా రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.200 వరకు జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు కూడా దీనిపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm