హైదరాబాద్ : తెలంగాణ రైతులకు రైతు బంధు నిధుల విడుదలకు ఏర్పాట్లు చేశామని.. 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో మొత్తంగా రూ.50,447 కోట్లకుపైగా జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో పంటల సీజన్‌కు ముందే ఏయే పంటలు సాగు చేయాలో సూచించడానికి మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని.. ఇలాంటిది దేశంలోనే తొలిసారి అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm