హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. దేశంలో బై బై మోడీ అని ట్రెండింగ్ అవుతోందన్నారు. బిజెపి ప్రభుత్వాలను కూల్చే పనిలో పడిందని,ఈడీని ఉసి గొల్పడం మీద దృష్టిపెట్టారు.వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు.దేశంలో 2 కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసగించారని ఆయన విమర్శించారు. మోడీకి హటావో.. భారత్కు బచావో నినాదం మొదలైందని చెప్పారు.పాలమూరుకు జాతీయహోదా ఇస్తారా?బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా?బీజేపీ కార్యవర్గ భేటీల్లో దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.బండి సంజయ్ హుందాగా మాట్లాడాలని బాల్క సుమన్ హితవు పలికారు.
Mon Jan 19, 2015 06:51 pm