హైదరాబాద్: దాదాపు ఆరు నెలలు కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్, కఠిన ఆంక్షలతో అతలాకుతలమైన చైనాలో పరిస్థితులు మళ్లీ యథాతథ స్థితికి చేరుకుటున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కారణంగా.. దాదాపు నాలుగు నెలలుగా చైనాలోని షాంఘై, బీజింగ్ నగరాల్లో జనం గుమిగూడే ప్రదేశాలైన షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు మూత పడి ఉన్నాయి. 2.5 కోట్ల మందికిపైగా పూర్తి లాక్ డౌన్ లో ఉండాల్సి వచ్చింది. ఇటీవలే కొద్ది కొద్దిగా ఆంక్షలు సడలిస్తూ వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm