హైదరాబాద్ : నిత్య మీనన్.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉండే హీరోయిన్లలో నిత్యామీనన్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా నిత్యా మీనన్ ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఇందుకు సంబంధించి.. హైదరాబాదులో నిర్వహించిన 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' సీరీస్ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ కి అందులో నటించిన ఆర్టిస్టులంతా హాజరయ్యారు ఇక అయితే ఈవెంట్లో నిత్యమీనన్ ఒక స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సహాయంతో నడుచుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళింది.. నిత్య ను అలా చూసి అందరూ ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఇక నిత్యామీనన్ కి ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్న సమయంలోనే నిత్య స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ.. ఈ సిరీస్ లో ఇలాంటి క్యారెక్టర్ లో నేను చేశాను. కానీ ఇప్పుడు నిజంగా ఇలా జరిగింది.. ఇక ఇటీవల ఇంట్లో స్టెప్స్ మీద నుంచి స్లిప్ అయి పడ్డాను. దాంతో ఇలా జరిగింది అంటూ నిత్యామీనన్ వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm