హైదరాబాద్ : ఆఫీసర్స్ చాయిస్ పేరుతో ప్రముఖ విస్కీని తయారు చేసే అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్ సెబీ వద్ద ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. రూ.2,000 కోట్ల ను ఐపీవో ద్వారా పెట్టుబడిదారుల నుంచి సమీకరించనుంది. ఇందులో రూ.1,000 కోట్ల విలువైన షేర్లను తాజా మూలధనం నుంచి జారీ చేయనుంది. మరో రూ.1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు తమకున్న వాటాల నుంచి విక్రయించనున్నారు. అంటే తాజా ఐపీవో ద్వారా కంపెనీకి సమకూరే నిధులు రూ.1,000 కోట్లు. ఐపీవో ద్వారా సమీకరించే ఈ రూ,1,000 కోట్లను రుణాలను తీర్చివేయడానికి కంపెనీ ఉపయోగించనుంది. తీసుకున్న రుణాలను చెల్లించలేకపోతుండం, వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. దేశంలోని ప్రముఖ స్పిరిట్స్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ సంస్థ విస్కీ, రమ్, బ్రాందీ, వొడ్కా ను 29 దేశాల్లో విక్రయిస్తోంది. తొమ్మిది బాట్లింగ్ యూనిట్లు ఉన్నాయి
Mon Jan 19, 2015 06:51 pm