హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు నేటి నుంచి జమ అవుతోంది. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతు బంధుః సంబురం మొదలైందన్నారు. మొదటి రోజున ఒక ఎకరం వరకు భూమి కలిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో 586.66 కోట్ల జమ కానున్నాయని చెప్పారు. ఇవి అంకెలు కావని.. రైతు సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ అంకితభావానికి సిసలైన ఆనవాళ్లు. అన్నారు. మొత్తం 68.10 లక్షల రైతులకు రూ. 7,521 కోట్లు పెట్టుబడి సాయంగా అందించనున్నట్టు మంత్రి తెలిపారు.
కేంద్రం అనేక ఆర్ధిక ఇబ్బందులు సృష్టిస్తున్నా అన్నదాతలకు ఏ లోటు రానివ్వద్దనే సీఎం కేసీఆర్ దృఢ సంకల్పానికి యావత్ రైతులోకం జేజేలు పలుకుతున్నదన్నారు. తొలకరి రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం...
రైతుబంధు అన్నదాతకు ప్రభుత్వం అందిస్తున్న వరం అని చెప్పారు. ఇది రైతు ప్రభుత్వమని... రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం అని ట్వీట్ లో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jun,2022 04:08PM