అమరావతి : ఏపీలోని గుడివాడలో రేపు జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా పడింది. ఎడతెరిపిలేని వర్షం, వాతావరణం అనుకూలంగా లేనందున కార్యక్రమం వాయిదా వేశారు. గుడివాడలో మహానాడు నిర్వహణపై మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ముఖ్య నేతలు సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మహానాడు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గుడివాడ మహానాడు తదుపరి తేదీ ఖరారు చేయాలని నేతలకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jun,2022 05:00PM