హైదరాబాద్ : ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ ఎవరూ ఊహించని విధంగా పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కే గుడ్‌బై చెప్పేశాడు.. సింగిల్స్, డబుల్స్ కన్నా పరుగుల కోసం ఎక్కువగా బౌండరీలపై ఆధారపడే ఈ ఎడంచేతి వాటం ఇంగ్లిష్ బ్యాటర్.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్సీ అందుకున్నాడు. తన నాయకత్వ ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అతను.. తన జట్టుకు 2019లో వన్డే ప్రపంచకప్ కూడా అందించాడు. ఏడేళ్లపాటు ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా ఉన్న అతను.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జట్టును నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కూడా దక్కించుకున్నాడు. అంతేకాదు, గతేడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముందుండి నడిపించాడు. దినేష్ కార్తీక్ నుంచి లీగ్ మధ్యలో జట్టు పగ్గాలు అందుకున్న అతను.. యూఏఈలో జరిగిన రెండో ఫేజ్ ఐపీఎల్‌లో జట్టును గాడిలో పెట్టి ఫైనల్స్ చేర్చాడు.
ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు, టీ20లు ఆడిన ఆటగాడిగానే కాదు.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 35 ఏళ్ల మోర్గాన్ కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అయితే మోర్గాన్ తీసుకున్న ఈ షాకింగ్ న్యూస్ చాలా మంది క్రీడాభిమానులకు మింగుడు పడటం లేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jun,2022 08:10PM