హైదరాబాద్ : టీమిండియా కెప్టెన్‌గా తను ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన అతను.. ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్లిన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత జట్టులో మూడు మార్పులు జరిగినట్లు తెలిపాడు. రుతురాజ్, చాహల్, ఆవేష్ ఖాన్ ఆడటం లేదని చెప్పిన పాండ్యా.. వారి స్థానాల్లో శాంసన్, హర్షల్ పటేల్, బిష్ణోయి ఆడుతున్నట్లు వెల్లడించాడు. అలాగే గత మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ కీపింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు సారధి బాల్బిర్నీ తెలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm