హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్ఆర్ఓ) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధంచేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్ఎల్‌వి సీ-53 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్‌ను ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లాలోని షార్ రెండో వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహకనౌక సింగపూర్, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫొటోలను తీసి పంపేలా వీటిని రూపొందించారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగనుంది. కౌట్‌డౌన్ ముగిసిన అనంతరం.. గురువారం సాయంత్రం 6 గంటల 02 నిమిషాలకు పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
Mon Jan 19, 2015 06:51 pm