హైదరాబాద్: వికారాబాద్ జిల్లా గొట్టిముక్క సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వికారాబాద్ కూలి పని కోసమని మృతులు పరిగి మండలం నస్కల్కు చెందిన ఖాజా, మోహన్ బైక్పై బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి బైక్ను కారు ఢీకొట్టింది. బైకుపై ఉన్న ఖాజా, మోహన్లు ఇద్దరూ మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm