హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను https://www.bse.telangana.gov.in/ అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు. జూన్ 28 ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm