హైదరాబాద్: నగర ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో గురువారం ఉదయం భేటీ అయ్యారు. జూలై 2న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. జలవిహర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఎర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. కాగా... ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ట్వీట్ చేశారు. అలాగే ఈనెల 27న యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మరోవైపు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్ధిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేయగా... ఈనెల 24న నామినేషన్ దాఖలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm