Seorang pembonceng motosikal cedera selepas buah kelapa terjatuh di atasnya ketika melalui Jalan Teluk Kumbar, Pulau Pinang. Kejadian yang menimpa individu berkenaan tular di media sosial namun, tiada kenyataan rasmi dikeluarkan setakat ini daripada pihak berkuasa serta PBT. pic.twitter.com/z4beQBpAdY
— Malaysia Gazette (@MalaysiaGazette) June 26, 2022
హైదరాబాద్: ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే ఏం జరిగింది? ఆమె ప్రాణాలను Helmet ఎలా రక్షించింది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని నడుపిస్తుంటే.. ఓ మహిళ మాత్రం అతడి వెనకాల కూర్చొంది. వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం.. పెనాంగ్‌లో ఉన్న వీధి గుండా వెళ్తుంగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టు మీద నుంచి ఓ కొబ్బరి కాయ రాలి.. వెనకాల కూర్చున్న మహిళ తలపై పడిపోయింది. అయితే లక్కీగా ఆమె హెల్మెట్ ధరించి ఉన్నందున తలకు బలమైన దెబ్బ తగలలేదు. అయితే.. పై నుంచి కొబ్బరి కాయ ఫోర్స్‌గా మీద పడటంతో ఆమె ధరించిన హెల్మెట్ ఊడిపోయింది. ఇదే సమయంలో సదరు మహిళ కూడా బండిపై నుంచి కింద పడిపోయింది. లక్కీగా వెనకాల నుంచి ఎటువంటి వాహనాలూ రాకపోడంతో చిన్నచిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. కాగా.. ఇందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గ మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఒకవేళ హెల్మెట్ లేకున్నట్టైతే.. తలకు తీవ్ర గాయమై ఆమె మరణించి ఉండేదని’ కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరేమో.. ‘ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.