హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నాస్కామ్ 12 ఎడిషన్ జీసీసీ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ గ్రోత్ గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. గత సంవత్సరం ఐటీ సెక్టార్‌లో లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. గత ఐదేండ్లుగా దేశంలో బెస్ట్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక వసతులు బాగున్నాయని పేర్కొన్నారు. అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ నిలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ, మత విబేధాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు.
సుస్థిర పాలన, సమర్థ నాయకత్వంతో తెలంగాణ దూసుకుపోతోందని కేటీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పట్టణాభివృద్ధిని పట్టించుకోలేదని తెలిపారు. ఈ ఐదేండ్లలో 30కి పైగా ఫ్లై ఓవర్లు నిర్మించామని చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్ తెలిపారు. టీ హబ్, వీ హబ్ ద్వారా అంకురాలకు చేయూత ఇస్తుందన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. టాస్క్ ద్వారా ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాలను పెంచుతున్నామని కేటీఆర్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jun,2022 04:51PM