హైదరాబాద్ : తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అనుకూల విధానాలు కల్పించడమే కాదు.. వారు ప్రశాంతవాతావరణంలో శాంతియుతంగా వ్యాపారాలు చేసుకునేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అనుకూల విధానాలు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మరోసారి అగ్రస్థానం అందుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్ అచీవర్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మళ్లీ అగ్రస్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మరో ఆరు రాష్ట్రాలతోపాటు తెలంగాణను డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) అగ్రస్థానంలో నిలిపిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కే కాదు.. పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కూడా ప్రాధాన్యతనిస్తున్నదని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jun,2022 09:54PM