తిరుమల : తిరుపతి-తిరుమల మధ్య ఆర్టీసీ బస్ ఛార్జీలు భారీగా పెరిగాయి. డీజిల్ సెస్ పేరుతో శుక్రవారం నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మినహా అన్ని బస్సుల్లో ఛార్జీలను పెంచారు. ఈ క్రమంలో తిరుపతి, తిరుమల మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రతి టికెట్ పై రూ. 15 పెంచారు. దాంతో ప్రస్తుతమున్న ఛార్జీ రూ. 75 ఇప్పుడు రూ. 90కి పెరిగింది. పిల్లల టికెట్ ధర రూ. 45 నుంచి రూ. 50 అయింది. రానుపోను టికెట్ ధర గతంలో 135 రూపాయలు ఉండగా ఇప్పుడు 160కి పెరిగింది. మరోవైపు డీజిల్ సెస్ కారణంగా తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm