న్యూఢిల్లీ: ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలని నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ప్రవక్తపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. దేశమంతటా భావోద్వేగాలను రగిలించిన నాయకురాలు ఆమె అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆమె దేశ ప్రజలకు మీడియా ద్వారా క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉదయ్‌పూర్‌లో టేలర్ హత్యకు గురైన దురదృష్టకర ఘటనకు ఆమె కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. నుపుర్ శర్మ దేశ భద్రతకు ముప్పు తెచ్చిందని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm