హైదరాబాద్ : ప్రియురాలి పెండ్లి మండపం ముందు ప్రియుడు ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని లంగర్‌హౌస్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ అశ్వక్(19) అదే ప్రాంతానికి చెందిన ఫాతిమా(19)ను ప్రేమించాడు. అయితే ఆమెకు వేరే వ్యక్తితో పెండ్లి నిశ్చయమైంది. అది తెలుసుకున్న అశ్వక్ ఆ పెండ్లిని ఆపడానికి రకరకాలు ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. చివరగా లంగర్‌హౌస్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న మొఘల్ ఫంక్షన్ హాల్‌లో తన ప్రేయసి పెండ్లి జరుగుతుండగా అక్కడకు చేరుకున్నాడు. కల్యాణ మండపం ముందు తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm