ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ కు నోటీసులు వచ్చాయి. అయితే ఐటి శాఖ నుంచి తనకు లవ్ లెటర్ వచ్చిందని శరద్ పవార్ ట్వీట్ చేశారు. తనకు 2004, 2009, 2014, 2020 ఎన్నిక సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఐటి శాఖ నుండి నోటీసులు వచ్చాయని తెలిపారు. అయితే ఆ సమాచారం ఇవ్వడం పట్ల తానేమీ ఆందోళన చెందడం లేదని అన్నారు. కొంత మంది వ్యక్తులపై సమాచారాన్ని సేకరిస్తోందని కేంద్రంపై మండిపడ్డారు. ఈ శాఖ ఇప్పుడు సామర్థ్యంలో పెరుగుదల ఉందని.. చాలా ఏండ్లుగా సమాచారాన్ని సేకరించడం, కొంత మంది నిర్థిష్ట వ్యక్తుల నుండి సమాచారాన్ని సేకరించడంపై దృష్టి సారించే వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm