హైదరాబాద్: ఈ నెల 24న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. సాలార్జింగ్ మ్యూజియంలో పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓల్డ్ సిటీ బోనాల కోసం రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. బోనాల పండగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా బోనాల ఉత్సవాల నిర్వహణకు తలసాని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, గొప్పగా పండుగలు జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి అభిమతమని తలసాని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm