హైదరాబాద్ : 2024 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్యర్థిగా తమిళ నటుడు విశాల్ పోటీ చేయబోతున్నారంటూ గడచిన కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను ఖండిస్తూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం క్లారిటీ ఇచ్చారు. తాజాగా విశాల్ కూడా ఈ వార్తలపై స్పందించాడు. ఏపీ రాజకీయాల్లోకి తాను త్వరలోనే ఎంట్రీ ఇస్తున్నట్లు, కుప్పంలో చంద్రబాబుపై పోటీకి దిగుతున్నట్టు వినిపిస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని విశాల్ ప్రకటించాడు. ఈ వ్యవహారం గురించి తనకు అసలే తెలియదని, ఈ దిశగా ఇప్పటిదాకా తనను ఎవరూ సంప్రదించలేదని కూడా అతడు తెలిపాడు. అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి పుట్టాయో కూడా తనకు తెలియదన్నాడు. తన దృష్టి మొత్తం సినిమాలపై ఉందన్న విశాల్.. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశమే తనకు లేదని తెలిపాడు. అంతేకాకుండా చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేసే ఉద్దేశం కూడా తనకు లేదని విశాల్ స్పష్టం చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm