హైదరాబాద్: నగరంలోని వివిధ మార్గాల్లో రాకపోలకు సాగించే పలు ఎంఎంటీఎస్ రైళ్లను ఈనెల 3వ తేదీన (ఆదివారం) రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్నుమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm