అమరావతి: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో, ఫోర్త్ వేవ్ ప్రారంభమయిందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు అధికార వైసీపీలో కరోనా కలకలం రేపింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల తమకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm