హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. యూపీ సీఎం యోగి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల యోగి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం రేపటికి వాయిదా పడింది. అయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా చార్మినార్ వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు చార్మినార్ వద్ద టీఆర్ఎస్ నేతల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు మోహరించారు. హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ డీసీపీ చైతన్య ఆధ్వర్యంలో పోలీస్ భద్రత పర్యవేక్షణ జరుగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm