హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తున్న వేళ హెచ్‌ఐసీసీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హెచ్ఐసీసీ, నోవాటెల్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా శివసేన రెడ్డిని, ఇతర తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులను మఫ్టీలో వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకెళ్లారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Jul,2022 02:46PM