హైదరాబాద్ : బ్యాంక్‌లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల్లో ఒరిజినల్ నోట్లు, ఫేక్ నోట్‌ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాము నిర‍్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కరెన్సీ నోట్ల ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ప్రతీ 3 నెలలకు ఒకసారి నోట్ సార్టింగ్ మెషీన్‌లను (డబ్బులు లెక్కించే యంత్రం) పరీక్షించాలని ఆర్‌బీఐ తెలిపింది.
'నోట్ సార్టింగ్ మెషీన్స్ అథెంటికేషన్, ఫిట్‌నెస్ సార్టింగ్ పారామీటర్స్` అనే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం.. ఫిట్ నోట్ అనేది 'వాస్తవమైన, తగినంత శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది` అని పేర్కొంది. నోటు భౌతిక స్థితిని బట్టి రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేయించనుంది. అలాగే రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను తప్పని సరిగా వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్ చేయించాలని సూచించింది. నోట్ సార్టింగ్ మెషీన్స్ ఫేక్ కరెన్సీ నోట్లు, చెలామణికి పనికి రాని నోట్లను గుర్తించి, వాటిని వేరు చేయగలగాలని పేర్కొంది. ఇలా కరెన్సీ నోట్లను తనిఖీ చేసి సంబధిత వివరాలను ఆర్బీఐకి పంపాలని తెలిపింది. అలాగే చినిగిపోయిన నోట్లు, నకిలీ నోట్లను అన్‌ఫిట్ నోటు కేటగిరి కింద ఉంచాలని పేర్కొంది. వీటిని బ్యాంకులు తప్పని సరిగా అమలు చేయాలని ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Jul,2022 02:54PM