హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30 గంటల వరకు గ్రేటర్‌లోని కుత్బుల్లాపూర్, గాజుల రామారంలో అత్యధికంగా 2.6సెం.మీలు, జీడిమెట్లలో 2.3సెం.మీలు, షాపూర్‌నగర్‌లో 2.2సెం.మీలు, అల్వాల్ కొత్తబస్తీలో 1.9సెం.మీలు, మౌలాలిలో 1.7సెం.మీలు, మల్కాజిగిరిలో 1.6సెం.మీలు, కూకట్‌పల్లి, తిరుమలగిరిలో 1.1సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాగల మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Jul,2022 09:15PM