హైదరాబాద్ : బర్మింగ్ హామ్ లో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టుకు వరుణుడు పదేపదే అడ్డు తగులుతున్నాడు. ఇవాళ రెండో రోజు ఆట మరోసారి వాన కారణంగా నిలిచిపోయింది. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులు. ఇంగ్లండ్ కోల్పోయిన 3 వికెట్లూ టీమిండియా తాత్కాలిక సారథి బుమ్రా ఖాతాలోకి చేరాయి. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 356 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో జో రూట్ (19 బ్యాటింగ్), జానీ బెయిర్ స్టో (6 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ కావడం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm