హైదరాబాద్ : టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతూ..తనపై భూకబ్జాలు, ఇతర కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వస్తే వాటిపై ముఖ్యమంత్రి విచారించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తనపై విచారణ జరుపుకోవచ్చని అన్నారు. కబ్జాలు చేసి ఉంటే ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. కృష్ణారెడ్డి అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదని, ఎవరో మిస్ గైడ్ చేశారో తనకు తెలియదన్నారు. తాను ఆయనతో కలిసి మాట్లాడుతానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm