నాగ్‌పూర్ : ఓ వ్యక్తి తన ప్రియురాలితో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో గుండెపోటుకు గురై మరణించినట్టు తెలిసింది. ఈ ఘటన మహారాష్ర్టలోని నాగపూర్‌లో సావనీర్ లాడ్జిలో వెలుగు చూసింది.
వివరాల్లోకెళ్తే.. డ్రైవర్‌గా, వెల్డింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పనిచేస్తున్న అజయ్ (28) తన 23 ఏండ్ల ప్రియురాలిని ఆదివారం సావోనర్‌లోని ఒక లాడ్జిలో కలిశాడు. దాదాపు అరగంట తర్వాత అజయ్ కుప్పకూలిన విషయాన్ని సదరు మహిళ లాడ్జి నిర్వాహకులకు తెలియజేసింది. అజయ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఇద్దరు సన్నిహితంగా మెలిగే సమయంలో అజయ్ స్పృహ కోల్పోయాడని పోలీసుల విచారణలో మహిళ తెలిపింది. అజయ్, మహిళకు ఫేస్బుక్లో పరిచయం కాగా మూడేండ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. త్వరంలో పెండ్లి కూడా చేసుకోబోతున్నారు. అజయ్ గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
సావోనర్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ పాటిల్ మాట్లాడుతూ.. గదిలో లేదా అజయ్ వద్ద డ్రగ్ రేపర్లు లేదా ప్యాకెట్లు కనిపించలేదని చెప్పారు. ఏ మందులకు సంబంధించిన ఆధారాలు కూడా కనుగొనలేదన్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తేలిందన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మృతి కేసు నమోదైంది. రసాయన విశ్లేషణ కోసం అజయ్ రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపారు.
కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ సంచేతి మాట్లాడుతూ.. శృంగారం సమయంలో గుండె ఆగిపోవడం అనేది చాలా అరుదని, అయితే అందుకు అవకాశం కూడా లేకపోలేదని అన్నారు. కరోనరో ఆర్టెరీ డిసీజ్ తో 20 ఏండ్ల యువకులకు కూడా ఇలాంటి మరణం సంభవించవచ్చని చెప్పారు. హార్డ్ బ్లాక్ వంటివి ఇవాల్టి యువతలో ఎక్కువగా కనిపిస్తోందని, కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌కు సరైన చికిత్స తీసుకోని పక్షంలో ఎక్కువ శక్తిని ఉపయోగించే సెక్స్ వంటి కార్యకలాపాల సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. 25 ఏండ్లు వచ్చేసరికి హార్డ్ చెకప్ చేయించుకోవడం మంచిదని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Jul,2022 04:39PM